మహిళా క్రికెట్ జట్టుకు బీసీసీఐ నజరానా
భారత మహిళా క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) నజరానా ప్రకటించింది. జింబాబ్వే పర్యటనలో రాణించిన భారత మహిళల జట్టుకు 21 లక్షల రూపాయల నజరానాను బీసీసీఐ ప్రకటించింది. జింబాబ్వేపై భారత మహిళా క్రికెట్ జట్టు 3-2 తేడాతో సిరీస్ గెలుచుకుంది. దీంతో బీసీసీఐ అధ్యక్షుడు జగ్ మోహన్ దాల్మియా నజరానా ప్రకటించారు. కాగా ఈ సిరీస్ సందర్భంగా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ 5వేల పరుగులు సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో మిథాలీ రాజ్ కు దాల్మియా శుభాకాంక్షలు తెలిపారు.